హీరోయిన్ పూజా హెగ్డేకి బంపరాఫర్.. ఏకంగా 10 ఏళ్ల తర్వాత! | Pooja Hegde In Talks With Suriya And Karthik Subbaraj Movie | Sakshi
Sakshi News home page

Pooja Hegde: పూజా పాపకి కోరుకున్న బ్రేక్ వచ్చేలా ఉందే!

Published Sat, May 18 2024 7:18 AM | Last Updated on Sat, May 18 2024 8:40 AM

Pooja Hegde In Talks With Suriya And Karthik Subbaraj Movie

పూజా హెగ్డే.. కాదు కాదు బుట్టబొమ్మ అంటే తెలుగు ప్రేక్షకులు టక్కున గుర్తుపట్టేస్తారు. కొన్నాళ్ల క్రితం తెలుగులో వరస సినిమాలతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరస ఫ్లాప్స్ దెబ్బకు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఇక ఈమె కెరీర్ ఖతం అని అందరూ ఫిక్సయ్యారు. ఇలాంటి టైంలో ఈమెకి క్రేజీ బంపరాఫర్ చెంతకు చేరింది. ఇంతకీ ఏంటి సంగతి?

(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కేసులో ట్విస్ట్‌.. ప్రియుడు సూసైడ్!)

కోలీవుడ్‌లో రేర్‌ కాంబో సెట్‌ కాబోతుంది. సూర్య 'కంగువ' మూవీ చేస్తున్నాడు. ఈ ఏడాదే థియేటర్లలోకి రానుంది. మరోవైపు తన 44వ చిత్రాన్ని కూడా రెడీ చేసేస్తున్నాడు. దీనికి కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకుడు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్స్, కార్తీక్‌ సుబ్బరాజ్‌ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. రీసెంట్‌గానే అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఈ మూవీలోనే పూజా హెగ్డేని హీరోయిన్ అనుకుంటున్నారట.

పదకొండేళ్ల క్రితం 'మాస్క్' అనే తమిళ సినిమాతోనే హీరోయిన్ అయిన పూజా హెగ్డే.. మధ్యలో విజయ్‌తో 'బీస్ట్‌'తో రీఎంట్రీ ఇచ్చింది. కానీ అది దెబ్బకొట్టింది. ప్రస్తుతం ఫ్లాప్స్ వల్ల పూర్తిగా ఛాన్సుల్లేక సైలెంట్ అయిపోయిన ఈమెకు.. సూర్య మూవీలో ఛాన్స్ అంటే బంపరాఫర్ అనే చెప్పొచ్చు. ఒకవేళ ఇది హిట్ అయితే మాత్రం మళ్లీ సౌత్‌లో పాగా వేసే ఛాన్స్ ప్లస్ కోరుకున్న బ్రేక్ రావొచ్చు. మళ్లీ రష్మిక లాంటి ట్రెండింగ్ బ్యూటీస్ పోటీ పడొచ్చు. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement