Actress Pooja Ramachandran Baby Shower Photos Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Actress Pooja Ramachandran: కనుల పండుగగా ‘స్వామిరారా’ నటి సీమంతం.. ఆకట్టుకుంటున్న ఫొటోలు

Feb 9 2023 7:14 PM | Updated on Feb 9 2023 7:49 PM

Actress Pooja Ramachandran Baby Shower Photos Goes Viral - Sakshi

ప్రముఖ నటి పూజా రామాచంద్రన్‌ త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ క్రమంలో ఆమె సీమంత వేడుకను ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పూజా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. కనుల పండుగగా జరిగిన ఈ సీమంత వేడుకలో పూజా దంపతుల ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. కాగా పూజా భర్త జాన్‌ కూడా నటుడనే విషయం తెలిసిందే.  

చదవండి: హైటెక్‌ సిటీ ఆఫీసులో మహేశ్‌ బాబు .. వీడియో వైరల్‌

వన్‌.. నేనొక్కడినే, కేజీఎఫ్ చాప్టర్ 1, బాహుబలి బిగినింగ్ సినిమాల్లో అతడు విలన్‌ పాత్రలు పోషించాడు. కాగా పూజా తెలుగులో స్వామి రారా, ఎంత మంచివాడవురా సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో పాల్గొని మరింత పాపులర్‌ అయ్యింది. కాగా పూజా రామ చంద్రన్‌- జాన్ కొకెన్‌ల వివాహం 2019లో జరిగింది. పూజాకి ఇది​ రెండో పెళ్లి. అంతకు ముందు  2017లో విజె క్రెగ్‌తో పూజా వివాహం జరిగింది.  

చదవండి: ‘యశోద’ లైంగిక వేధింపుల కేసు.. యువతి వాంగ్మూలంతో వెలుగులోకి షాకింగ్‌ విషయాలు!

Advertisement
 
Advertisement
Advertisement