నేను నెగటివ్‌ | Actress Payal Rajput Testing For Corona Virus | Sakshi
Sakshi News home page

నేను నెగటివ్‌

Sep 28 2020 1:49 AM | Updated on Sep 28 2020 8:04 AM

Actress Payal Rajput Testing For Corona Virus - Sakshi

పాయల్‌ రాజ్‌పుత్‌

కోవిడ్‌ నిబంధనలతో షూటింగ్స్‌ ప్రారంభమయ్యాయి. షూటింగ్‌లో పాల్గొనే ముందు కరోనా టెస్ట్‌లు చేయించుకుని చిత్రీకరణలో జాయిన్‌ అవుతున్నారు స్టార్స్‌. తాజాగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ కూడా కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నారు. కానీ ఈ టెస్ట్‌ నన్ను చాలా భయపెట్టింది అంటున్నారు. కరోనా టెస్ట్‌ చేయించుకున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు పాయల్‌. ‘‘కరోనా టెస్ట్‌ అంటే చాలా భయమేసింది. ముఖ్యంగా ఆ ముక్కులో నుంచి స్వాబ్‌ తీసుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఫలితాల్లో నెగటివ్‌ అని వచ్చింది. షూటింగ్‌ స్టార్ట్‌ చేయబోతున్నాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. భౌతిక దూరం పాటించండి’’ అని అన్నారు పాయల్‌ రాజ్‌పుత్‌.

Advertisement
 
Advertisement
Advertisement