'కాంతార' సినిమాలో ఛాన్స్ కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు! | Actress Payal Rajput Request Rishab Shetty For Kantara: Chapter 1 Movie | Sakshi
Sakshi News home page

Kantara-1 Movie: అవకాశం కోసం క్రేజీ హీరోయిన్ డిఫరెంట్ ప్రపోజల్!

Published Tue, Dec 12 2023 5:55 PM | Last Updated on Tue, Dec 12 2023 6:13 PM

Actress Payal Rajput Request Rishab Shetty For Kantara 1 Movie  - Sakshi

సాధారణంగా ఓ సినిమా తీస్తున్నారంటే చాలామంది యువనటీనటులు.. అందులో ఛాన్స్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తారు. కానీ అలాంటి ఓ పాన్ ఇండియా మూవీ కోసం ఏకంగా ప్రముఖ హీరోయినే ప్రయత్నిస్తే? అవును మీరు సరిగానే విన్నారు. ప్రస్తుతం 'కాంతార' మూవీకి ప్రీక్వెల్ తీసే పనిలో హీరో రిషభ్ శెట్టి బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైంలో క్రేజీ హీరోయిన్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని బతిమాలాడుకుంది.

ఏంటి విషయం?
కన్నడ హీరో రిషభ్ శెట్టిని.. రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్‌ని చేసి మూవీ 'కాంతార'. విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా గతేడాది దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్ తీస్తున్నారు. మొన్నీమధ్యే పోస్టర్ రిలీజ్ చేయగా, తెగ వైరల్ అయిపోయింది. 

(ఇదీ చదవండి: లక్కీ హీరోయిన్ కోసం నిర్మాతగా మారిన 'జైలర్' డైరెక్టర్)

ఛాన్స్ అడుక్కుంది
అయితే 'కాంతార-1' సినిమాలో తనకు ఓ ఛాన్స్ ఇవ్వాలని.. ఎక్స్ (ట్విట్వర్) వేదికగా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ పోస్ట్ పెట్టింది. 'రిషభ్ శెట్టి, హోంబలే ఫిల్మ్స్.. కాంతార చాప్టర్-1 కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని నాకు తెలిసింది. ఈ ప్రాజెక్టులో భాగం కావాలని నాకు ఆశగా ఉంది. ఈ మధ్య విడుదలైన 'మంగళవారం'లో నా యాక్టింగ్‌ని అందరూ ప్రశంసించారు. మీరు కాస్త టైం కేటాయించి నా సినిమా చూస్తే మీకు కృతజ్ఞతలు చెప్పుకొంటాను. ఈ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్ ఇవ్వడానికి ఏం చేయాలో దయచేసి చెప్పండి. నా పేరు రీపోస్ట్ చేస్తూ సహకరించే అభిమానులు థ్యాంక్స్' అని పాయల్ రాసుకొచ్చింది.

మరి పాయల్ కోరుకున్నట్లు.. 'కాంతార-1' హీరో గానీ మూవీ యూనిట్ గానీ ఈ ట్వీట్ చూసి, ఛాన్స్ ఇస్తే మాత్రం పాయల్ ని అదృష్టం వరించినట్లే. చూద్దాం మరి ఈ బ్యూటీ అనుకున్నది జరుగుతుందో లేదో?

(ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement