రక్తం అమ్ముకుని కడుపు నింపుకున్నా: నటి | Brahmamudi Serial Actress Nainisha Rai Comments On Casting Couch And Her Life Struggles In TV Industry - Sakshi
Sakshi News home page

Actress Nainisha Rai: రక్తం అమ్ముకుని కడుపు నింపుకున్నా: నటి

Published Tue, Feb 20 2024 11:09 AM

Actress Nainisha Rai Comments On TV Industry - Sakshi

బుల్లితెరపై 'బ్రహ్మముడి సీరియల్‌'లో అప్పు పేరుతో గుర్తింపు తెచ్చుకుంది నటి నైనీషా రాయ్. సినిమాలంటే విపరీతమైన ఇష్టంతో బెంగాలీ నుంచి టాలీవుడ్‌కు వచ్చేసింది. ఇంటర్ మీడియట్ చదువుతున్న సమయంలోనే హైదరాబాద్ వచ్చేసింది. ఇక్కడ అనేక కష్టాలను ఎదుర్కొంటూ పలు సీరియల్స్‌లో ఆఫర్లు దక్కించుకుంది. కలిసి ఉంటే కలదు సుఖం, వంటలక్క,  భాగ్య రేఖ, ఇంటిగుట్టు, హంసగీతం వంటి సీరియల్స్‌లలో ఆమె మెప్పించింది. శ్రీమంతుడు  అనే సీరియల్‌లో లీడ్‌ రోల్‌లో కూడా నైమిషా రాయ్ కనిపించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నైనీషా రాయ్ బుల్లితెర గురించి పలు విషయాలు షేర్‌ చేసింది. ఇక్కడ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో కనీసం తినడానికి కూడా తిండిలేదని నైనీషా రాయ్ వాపోయింది. ఆకలి తీర్చుకునేందుకు తన రక్తాన్ని కూడా అమ్ముకున్నట్లు ఆమె చెప్పింది. ఇలా ఎన్నో కష్టాలు పడుతున్న సమయంలో ఆఫర్లు వచ్చాయని సంతోషిస్తే నాకేంటి అంటూ తిరిగి అడిగే వారే ఎక్కువగా ఉన్నారని తెలిపింది. ఈ క్రమంలో ఏదో ఆఫర్‌ వచ్చింది కదా అని షూటింగ్‌కు వెళ్తే.. కమిట్‌మెంట్‌ కండీషన్‌ పెట్టారు. ఒకానొక సమయంలో బలవంతం కూడా పెట్టారు. ఆ సమయంలో వాళ్లను కొట్టి ఏదోలా వచ్చేశానని ఆమె గుర్తు చేసుకుంది.

నిజ జీవితంలో కూడా నైనిషా చాలా కష్టాలను చూసింది. బెంగాలీ కుటుంబానికి చెందిన నైనిషా రాయ్ తండ్రి లెక్చరర్ అయితే ఆమె అమ్మగారు హౌస్ వైఫ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఆమె తెలుగు పరిశ్రమకు వచ్చింది. ఇంటర్‌ చదువుతున్న సమయంలోనే తాను ఇంటి నుంచి వచ్చేసినట్లు తెలిపింది. ఇక్కడ తన సొంత కష్టంతో చదువుకుంటూనే చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసింది. వచ్చిన అవకాశాన్ని తన టాలెంట్‌తో సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులకు దూరం కావడం జరిగిపోయింది.  నైనిషా రాయ్ ఇండస్ట్రీ వైపు రావడం వాళ్లకి ఇష్టం లేకపోవడంతో తనే ఇంటి నుంచి వచ్చేసినట్లు తెలిపింది. కానీ తన తల్లిదండ్రులతో ఎలాంటి గొడవలు లేవని నైనిషా రాయ్‌ చెప్తూనే.. 'వాళ్ల ఆలోచనలో వాళ్లు కరెక్టేమో కానీ.. నాకు మాత్రం వాళ్లు చేసింది తప్పు' అని చెప్పింది.

(ఇదీ చదవండి: ప్రపంచ సుందరి పోటీలు.. నా జెండా గుండెల్లో ఉంది: సినీ శెట్టి)

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement