Actress Mumtaj: నటి ముంతాజ్‌పై గృహ హింస ఆరోపణలు

Actress Mumtaj Charged Child Labour Violence Minor Girls Tamil Nadu  - Sakshi

తమిళసినిమా: నటి ముంతాజ్‌ గృహ హింస ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈమె అన్నా నగర్‌లో నివసిస్తున్నారు. కాగా ఈమె ఇంట్లో ఆరేళ్లుగా ఉత్తరాది రాష్ట్రానికి చెందిన మైనర్‌ బాలికలు పని చేస్తున్నారు. మంగళవారం అనూహ్యంగా బాలికల్లో ఒకరు అన్నానగర్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి తాము సొంత ఊరుకు వెళ్లిపోవాలనుకుంటున్నట్లు, అయితే ఇంటి యజమానురాలు అనుమతి ఇవ్వటం లేదని, హింసిస్తున్నారని చెప్పింది.

అన్నానగర్‌ పోలీసులు ఆ బాలిక ఉన్న ప్రాంతానికి వెళ్లి తనతో పాటు ముంతాజ్‌ ఇంటిలో మరో బాలికను చెన్నైలోని బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. బుధవారం బాలల సంరక్షణ కేంద్రం అధికారి శాలిని ఆ ఇద్దరి నుంచి వివరాలు సేకరించారు.

చదవండి: Keerthi Suresh: నా దృష్టిలో ఆ రెండూ కష్టం! 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top