Meena: బర్త్‌డే సెలబ్రేషన్‌లో మీనా, యూట్యూబ్‌లో ట్రెండింగ్

నవ్వుల రారాజు రాజేంద్ర ప్రసాద్ ఇటీవలే తన బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాడు. జూలై 19న తన పుట్టినరోజు సందర్భంగా 'ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు' సినిమా సెట్స్‌లో కేక్ కట్ చేశాడు. అయితే దీన్నంతటినీ తన కెమెరాలతో క్యాప్చర్ చేసింది కమెడియన్ అలీ భార్య జుబేదా. సెట్స్‌లోకి వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించింది. ఇక ఈ సినిమా సెట్స్‌లో నటి మీనా కూడా ఉండటంతో ఆమెను కలిసింది జుబేదా.
నీకు వీరాభిమానిని అంటూ మీనాతో మాటలు కలిపింది జుబేదా. గతంలో 'పెళ్లాం చెబితే వినాలి' సినిమా సమయంలో కలిశామని, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కలిశామని చెప్తూ సంతోషపడిపోయిందామె. పెళ్లాం చెబితే వినాలి సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసి 7వ తరగతి పరీక్షలు మానేసి మరీ మిమ్మల్ని కలిశానంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది జుబేదా. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు కలుద్దామన్నా సెట్ అవ్వలేదని చెప్పుకొచ్చింది. ఏదైతేనేం, ఇన్నాళ్లకు మీనా తన యూట్యూబ్‌కు చిక్కిందని సంబరపడిపోయింది. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత తెలుగులో నటిస్తున్నాననంది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తొలిసారి యాక్ట్ చేస్తున్నానని తెలిపింది. తెలుగులో సినిమాలు చేయట్లేదని ఇప్పటికే చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, తప్పకుండా తెలుగులో మూవీస్ చేస్తాను అని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
చదవండి: యంగ్ హీరో శ్రీవిష్ణుకు తీవ్ర అస్వస్థత
తెలుగు సినిమాలకు అవార్డుల పంట, ఏ సినిమాకు ఏ అవార్డు వచ్చిందంటే?