Khushbu Sundar Sundar: నటి ఖుష్బూకు కీలక బాధ్యతలు

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో నటి, బీజేపీ సభ్యురాలు ఖుష్బూ సందర్ కీలక బాధ్యతలు నిర్వహించానున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో గోవాలో 53వ అంతర్జాతీయ చిత్రోత్సవాలు జరగనున్నాయి. కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అధ్యక్షతన జరగనున్న ఈ చిత్రోత్సవాలకు ఉపాధ్యాక్షుడిగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్ వ్యవహరించనున్నారు.
చదవండి: కృష్ణ వంశీ భారీ ప్లాన్.. రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్!
ఇందుకు గానూ ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మార్గదర్శక కమిటీ సభ్యురాలిగా నటి ఖుష్బూ బాధ్యతలను నిర్వహించానున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఆమెతో పాటు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, విపుల్ అమృత్‌వాల్ షాకు కమిటీలో చోటు కల్పించారు.