Karate Kalyani: మళ్లీ పెళ్లి చేసుకుంటా.. ఇప్పటికి ఆ ఆశ తీరలేదు

Actress Karate Kalyani About Marriage And Divorce - Sakshi

ఎన్నో సార్లు ఆత్మహత్యాయత్నం చేశా, అయినా..

 సినీ నటి, బీజేపీ నాయకురాలు కరాటే కల్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పనవక్కర్లేదు. సినిమాల్లో ఆమె బోల్డ్‌ పాత్రల ద్వారా గుర్తింపు పొందిన కరాటే కల్యాణ్‌ బిగ్‌బాస్‌ 4 ద్వారా మరింత ఫేంను సంపాదించుకుంది. ముక్కుసూటిగా మాట్లాడే కల్యాణి తన పదాలతో, వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న కల్యాణి తన వ్యక్తిగత, వైవాహిక జీవితంలో ఎదురైన చేదు సంఘటనలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యింది.

చదవండి: హీరోయిన్‌ బాడీపై అసభ్య కామెంట్‌, నందిత దిమ్మతిరిగే సమాధానం

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘భార్య అంటే వంటింటికే పరిమితం. ఏం చెప్తే అది చేయాలి.. ఎదురు మాట్లాడకూడదు అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ నేను అలా కాదు. ఫైర్ లాంటి దాన్ని  అరచేతితో ఆపేయలేరు. నిప్పుని ఎంతసేపు అని పట్టుకుంటారు. అందుకే వదిలేశారు. నేను కరెక్ట్‌గానే ఉన్నాను అనుకున్నా.. కానీ అది వారికి తప్పు అనిపించిందేమో. అలా మనస్పర్థలతో గొడవలు, అనుమానాలు. నాకు అది నచ్చలేదు. అందుకే విడాకులు తీసుకున్నా. నాకు నచ్చినట్టు నేను హ్యాపీగా జీవిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ప్రేమ, పెళ్లిళ్లు తనకు కలిసిరావని, ఇప్పటి వరకు తనకు నిజమైన ప్రేమ దొరకలేదంటూ కల్యాణి వాపోయింది. 

చదవండి: లేటెస్ట్‌ బేబీ బంప్‌ ఫొటోలు షేర్‌ చేసిన కాజల్‌

‘ప్రేమ, పెళ్లి పేరుతో నన్ను వాడుకున్నారు. అందుకే ఇప్పటికీ నిజమైన ప్రేమ కోసం చూస్తున్నాను. అలాంటి ప్రేమ దొరికితే భవిష్యత్తులో పెళ్లి చేసుకోడానికి సిద్ధంగా ఉన్నా. సరైనా అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటానంటే పెళ్లికి లేదా సహజీవనానికి కూడా రెడీ. ఎందుకంటే నాకు పిల్లలు అంటే ఇష్టం. ఆ ఆశతోనే రెండు సార్లు వివాహం చేసుకున్న. కానీ ఆ ఆశ ఇప్పటికి తీరలేదు’ అని ఆమె పేర్కొంది. అంతేగాక తన మాజీ భర్తల వల్ల చాలా కష్టాలు పడ్డానంటూ ఇలా చెప్పుకొచ్చింది. ‘తరచూ తాగోచ్చి కొట్టడం చేస్తుంటే భరించలేకపోయాను. పైగా నాపై అనుమానం. నేను చేయని తప్పుకి పడమంటే ఎలా పడతాను. 

చదవండి: రూ. 200 కోట్లకు పైగా లతా ఆస్తులు ఎవరికి? వీలునామాలో ఏం ఉంది..

తప్పంతా నాదే అంటే ఎలా కుదురుతుంది. అందుకే విడాకులు తీసుకున్నాను’ అంది. కానీ జనాలకు ఇవేం పట్టవు. నేను పడ్డ కష్టాలు ఏ ఆడది పడి ఉండదు. ఆ కష్టాలను ఎదుర్కొని నిలబడ్డాను. ఒకానోక సమయంలో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోవాలని నిర్ణయించుకుని పలుమార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. ఒకసారి పది నిద్రమాత్రలు తీసుకున్న. అయిన బతికి బయటపడ్డాను. దేవుడు నన్ను కాపాడాడు అంటే ఇంకా నేను చేసేదో ఎదో ఉందన్నమాట అని ఆలోచించి ధైర్యంగా నిలబడ్డాను. పది మంది సాయం చేస్తూ ఇలా ఒంటిరిగా జీవిస్తున్నా’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top