అలా పెళ్లి చేసుకోలేదు.. తన లవ్‌స్టోరీ చెప్పిన ఇంద్రజ

Actress Indraja Reveals Her Love Marriage Story - Sakshi

‘నీ జీను ప్యాంటూ చూసి బుల్లెమ్మో...’అనే పాట వినగానే అందరికి టక్కున గుర్తుకువచ్చేంది ఇంద్రజ. చేసింది కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఒకప్పుడు హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ఈ  ‘బుల్లెమ్మ’ తెలుగు తెలుగమ్మాయే అన్న విషయం చాలామందికి తెలీదు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఇంద్రజ.. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తుంది. ప్రస్తుతం ఆమె ఓ కామెడీ షోకి జడ్జీగా వ్యవహరిస్తోంది.

దీనితో పాటు సినిమాల్లోకి కూడా రీఎంట్రీ ఇవ్వనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ న్యూస్‌ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ, పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లండించింది ఇంద్రజ. తను అచ్చ తెలుగు బ్రాహ్మిణ అమ్మాయినని, తన భర్త మాత్రం ముస్లిం అని చెప్పింది. ఇప్పటికి కూడా తాను బ్రాహ్మిణ అమ్మాయిగానే ఉంటానని చెప్పుకొచ్చింది.

 ‘ఒకరిని ఒకరు ఇష్టపడ్డాం. మతం చూసి, కులం చూసి ఇష్టపడం కదా.. నేను చెప్తే సినిమా డైలాగ్‌లా ఉంటుంది కానీ.. ఇది మాత్రం సినిమా డైలాగ్ కాదు. ఇది నా రియల్ లైఫ్. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ ఉండేవారు. మేం ఇద్దరం ఫ్రెండ్స్‌గా ఆరేళ్లు ఉన్నాం.. పరిచయం అయిన వెంటనే పెళ్లి చేసుకోలేదు. ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడం.. అర్థం చేసుకోవడం జరిగాయి. అతను నాకు పూర్తిగా సపోర్ట్ ఉంటాడనే నమ్మకం కలిగింది. అదే నమ్మకం ఆయనకి కూడా కలిగి ఉండొచ్చు. అందుకే పెళ్లి చేసుకున్నాం. ఆయనకు ఇండస్ట్రీలో సంబంధాలు ఉన్నాయి. ఆయన రచయిత. కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు. అంతేకాదు. ఆయన యాడ్ ఫిల్మ్ మేకర్. ఇద్దరం కలిసి సినిమాల గురించి మాట్లాడుకుంటాం. ఆయన రాసిన కథని మలయాళంలో దర్శకుడు శ్రీనివాస్ గారు తీసుకున్నారు. అలాగే నా సినిమాల్లో ఆయన ఇన్వాల్వ్ అవుతుంటారు. కానీ నాకు లిమిట్స్ ఏం పెట్టారు’అంటూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top