మెగాస్టార్‌ సాంగ్‌లో కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టిన బ్యూటీ.. తొలిసారి ఇలా | Actress Gauhar Khan First Time Reveal Her Son's Photo | Sakshi
Sakshi News home page

మెగాస్టార్‌ సాంగ్‌లో కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టిన బ్యూటీ.. తొలిసారి ఇలా

Mar 22 2024 10:02 AM | Updated on Mar 22 2024 10:33 AM

Actress Gauhar Khan First Time Reveal Her Son's Photo - Sakshi

గౌహర్‌ ఖాన్.. బాలీవుడ్‌లో ఆమె పేరు చాలా పాపులర్‌. బిగ్‌బాస్‌ సీజన్‌-7 విన్నర్‌,టీవీ స్టార్‌,మోడల్‌,హీరోయిన్‌ ఇలా పలు రంగాల్లో రాణించిన ఆమె కొరియోగ్రాఫర్‌ జైద్‌ దర్బార్‌ను 2020లో ప్రేమించి వివాహం చేసుకుంది. గతేడాది పండంటి బిడ్డకు వారు జన్మనిచ్చి జెహాన్ అనే పేరు పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు బాబు ఫోటోలను వారు విడుదల చేయలేదు. రంజాన్‌ మాసం సందర్భంగా ముస్లింలకు పరమ పవిత్రమైన నగరం మక్కా క్షేత్రంలో బాబు ఫోటోను రివీల్‌ చేసి వారి ఆనందాన్ని పంచుకున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన సూపర్‌ హిట్ సినిమా శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌తో తెలుగు వారికి గౌహర్‌ ఖాన్ సుపరిచయమే. ఇందులో 'నాపేరే కాంచనమాల' అనే స్పెషల్‌ సాంగ్‌తో అభిమానులను ఓ రేంజ్‌లో ఆమె అలరించింది. ఈ పాటతో తెలుగు కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టింది బాలీవుడ్‌ బ్యూటీ గౌహార్‌ ఖాన్‌.

18 ఏళ్ల వయసులో మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన గౌహర్‌ఖాన్‌ పలు అందాల పోటీల్లోనూ పాల్గొన్నారు. యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఆమె పలు సీరియల్స్‌లోనూ నటించారు. గేమ్‌, రాకెట్‌ సింగ్‌, ఫీవర్‌, బేగం జాన్‌ వంటి చిత్రాలతో పాటు తాండవ్‌ వెబ్‌ సిరీస్‌ ఆమెకు మంచి పేరును తెచ్చాయి. ఆమె పెళ్లి నాటికి వారి వయసు గౌహర్‌ ఖాన్(37)‌, కొరియోగ్రాఫర్‌ జైద్‌ దర్బార్‌(25).  గౌహర్‌ ఖాన్‌ కంటే జైద్‌ దర్బార్‌ 12 ఏళ్లు చిన్నవాడు కావడంతో వారి పెళ్లి గురించి పలు విమర్శలు వచ్చాయి. కానీ పెళ్లి తర్వాత వారు ఎంతో సంతోషంగా గడుపుతున్నట్లు పలు ఫోటోలతో పంచుకుంటూ వచ్చారు.

గతేడాది మే నెలలో ఒక బాబుకు జన్మనిచ్చినట్లు వారు ఎంతో సంతోషంగా ఆ వార్తను పంచుకున్నారు. బాబును తొలిసారిగా పవిత్ర స్థలమైన మక్కాకు తీసుకుని రావడం చాలా సంతోషంగా ఉంది. అతనికి నిరంతర సానుకూలత, ప్రేమ, ఆశీర్వాదం ఇవ్వాలని ఫ్యాన్స్‌ను వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement