This Actress Charges Rs 1 Crore For 1 Minute, Check Her Actress's Name - Sakshi
Sakshi News home page

నిమిషానికి రూ.కోటి తీసుకుంటున్న హీరోయిన్‌.. నయనతార, సమంత, ప్రియాంక.. వీళ్లెవరూ కాదు!

Jul 10 2023 4:53 PM | Updated on Jul 10 2023 5:01 PM

This Actress Charges Rs1 Crore For 1 Minute, Check Her Actress Name - Sakshi

మూడు నిమిషాల పాటకుగానూ మూడు కోట్లు డిమాండ్‌ చేసిందంటూ ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఈ లెక్కన ఆమె నిమిషానికి కోటి రూపాయలు తీసుకుందన్నమాట! ఇదెంతవరకు ని

హీరోలతో సమానమైన పారితోషికం మాకెక్కడిది? అని పెదవి విరిచే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. నిజమే, హీరోలతో సమానంగా రెమ్యునరేషన్‌ అందుకునేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం హీరోయిన్లు తీసుకున్నంత పారితోషికాన్ని హీరోలు కూడా అందుకోలేరు.. అవును, సినిమా మొత్తానికి ఓ సాధారణ హీరో రూ.2 కోట్లు తీసుకున్నా అందులో ఐటం సాంగ్‌ చేసిన హీరోయిన్‌కు అంతకన్నా ఎక్కువే ముట్టజెపుతారు నిర్మాతలు. వారు అడిగినంత ఇచ్చేందుకు కూడా వెనుకాడరు.

ఐటం సాంగ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయిన ఊర్వశి రౌతేలా కెరీర్‌ ఇప్పుడు పీక్స్‌లో ఉంది. బాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉన్న ఈమె వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటం సాంగ్‌ బాస్‌ పార్టీలో తళుక్కుమని మెరిసింది. ఈ చిత్రానికి గానూ ఆమెకు రెండు కోట్లు ముట్టాయట. ఈ మూవీ, ఆ పాట రెండూ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టడంతో బ్యూటీకి మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. ఆ తర్వాత ఏజెంట్‌లో వైల్డ్‌ సాలా పాటలో తన ఒంపుసొంపులను ప్రదర్శించింది. 

అలాగే పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌తేజ్‌ల బ్రో సినిమాలోనూ మై డియర్‌ మార్కండేయ అంటూ స్పెషల్‌ సాంగ్‌లో స్టెప్పులేసింది. ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని స్కంధ సినిమాలో కూడా ఓ పాటలో మెరుపు తీగలా వచ్చిపోనుంది. అయితే ఈ చిత్రంలో మూడు నిమిషాల పాటకుగానూ మూడు కోట్లు డిమాండ్‌ చేసిందంటూ ఓ వార్త వైరల్‌ అవుతోంది. ఈ లెక్కన ఆమె నిమిషానికి కోటి రూపాయలు తీసుకుందన్నమాట! ఇదెంతవరకు నిజమో తెలియదు కానీ కాలం కలిసొచ్చినప్పుడే కోట్లు కూడబెట్టుకోవాలి అనే ఫార్ములాను ఊర్వశి గట్టిగానే ఫాలో అవుతోందంటున్నారు అభిమానులు.

చదవండి: అల్లర్ల మధ్య హోటల్‌లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఊర్వశి రౌతేలా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement