మా అక్కను కాపాడండి.. మరోసారి సాయం కోరిన హీరోయిన్‌ సోదరి | Actress Arundhathi Nair's Sister Asking Help To Foot Hospital Bills | Sakshi
Sakshi News home page

మా అక్కను కాపాడండి.. మరోసారి సాయం కోరిన హీరోయిన్‌ సోదరి

Published Fri, Mar 22 2024 8:09 AM | Last Updated on Fri, Mar 22 2024 9:08 AM

Actress Arundhathi Sister Asking Help For Hospital Bills - Sakshi

కోలీవుడ్‌ హీరోయిన్‌ అరుంధతి నాయర్‌ రోడ్డు ప్రమాదానికి గురై గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతుంది. సుమారు ఆరు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అరుంధతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆమె ఆరోగ్యం విషమంగా ఉంది. ఎవరైనా సాయం చేస్తే గానీ బతకదని  తన సోదరి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. సాయం చేయాలంటూ వేడుకుంటున్నారు. అందుకోసం బ్యాంకు వివరాలను సైతం ఇవ్వడం జరిగింది.

ఈ నేపథ్యంలో ఆర్థికసాయం కోరుతూ అరుంధతి సోదరి ఆర్తి మీడియా ముందుకువచ్చారు. 'నా సోదరి తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రి బిల్లులు చెల్లించడానికి కూడా మా వద్ద డబ్బుల్లేవు. దాంతో మేము ఫండ్‌ రైజింగ్‌ మొదలుపెట్టాం. ఇదొక పెద్ద స్కామ్‌ అంటూ చాలామంది ట్రోల్‌ చేశారు. ఆస్పత్రి చుట్టూ మేము పరుగులు పెడుతుంటే ఇలాంటి నెగెటివిటీ వస్తుందనుకోలేదు' అన్నారు.

ప్రస్తుతం అరుంధతికి బ్రెయిన్‌ సర్జరీ చేపించాలని ఆర్తి తెలిపింది. అందు కోసం త్రివేండ్రంలోని అనంతపూరి ఆస్పత్రిలో చేర్పించామని ఆమె చెప్పుకొచ్చింది. కదలలేని స్థితిలో వెంటిలేటర్‌ మీద అరుంధతి ఉన్నట్లు ఆమె పేర్కొంది. ఇప్పటికే సుమారు రూ. 5 లక్షలకు పైగా ఖర్చు పెట్టామని ఆమె తెలిపింది. ట్రీట్‌మెంట్‌ పూర్తయ్యేసరికి ఖర్చు ఎంత అవుతుందో చెప్పలేమని.. అందుకు కావాల్సిన డబ్బు తమ వద్ద లేదని ఆమె వాపోయింది. సాయం చేయాలనుకునే వారి కోసం తన బ్యాంకు ఖాతా వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 

అరుంధతి స్నేహితురాలు, సహనటి రమ్య మాట్లాడుతూ.. 'కోలీవుడ్‌లో తెరకెక్కిన పలు చిత్రాల్లో అరుంధతి హీరోయిన్‌గా నటించారు. ఆమె తలకు తీవ్రంగా గాయమైంది. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, లేదా నడిగర్‌ సంఘం సభ్యులు ఒక్కరూ సాయం చేయడానికి ఆసక్తి చూపించలేదు. కనీసం మాట్లాడనూ లేదు. తన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోలేదు.సహ నటీనటులు కొంతవరకు మాత్రమే సాయం చేయగలరు. ఎందుకంటే, మేము రూ.కోట్లలో సంపాదించడం లేదు.' అని వాపోయారు. తమిళ చిత్రం అయిన 'పొంగి ఎజు మనోహర'తో అరుంధతి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత విజయ్‌ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన 'సైతాన్‌'లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement