అందుకే సౌందర్య ఎక్స్‌పోజింగ్‌ చేయలేదు : ఆమని

Actress Aamani Shares Her Relationship with Soundarya - Sakshi

సౌందర్య.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు ఇది. ఈ పేరు వినబడగానే చీరకట్టులో ఓ అందమైన యువతి రూపం కళ్లముందు కదులుతుంది. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న ఈ మహానటి.. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ చనిపోయే వరకు నెంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగింది. కానీ దురదృష్టవశాత్తు కేవలం 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది. మరణించి 17 ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఆమెను మరిచిపోలేకపోతున్నారు అభిమానులు. దానికి కారణం ఆమె ఆందం కాదు కేవలం నటన మాత్రమే. ఎలాంటి గ్లామర్‌ ఎక్స్‌పోజింగ్‌ ఇవ్వకుండా.. కేవలం యాక్టింగ్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకుంది సౌందర్య.

ఒకవైపు.. రమ్యకృష్ణ, మీనా లాంటి స్టార్‌ హీరోయిన్లు తమ అందాలను బయటపెడుతూ గట్టి పోటీ ఇచ్చినా.. సౌందర్య మాత్రం కేవలం చీరకట్టులో తెరపై కనిపించి మెప్పించింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వందల చిత్రాల్లో నటించిన సౌందర్య ఎక్స్‌పోజింగ్‌కు ఎందుకు దూరంగా ఉందో ఆమె స్నేహితురాలు, సీనియర్‌ నటి ఆమని ఇటీవల వెల్లడించింది.

కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా..’. ఈ మూవీలో ఆమని కీలక పాత్రలో నటించింది. మూవీ ప్రమోషన్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్యూ ఇచ్చిన ఆమని.. సౌందర్యతో తనకు ఉన్న అనుబంధం, ఆమె ఎక్స్‏పోజింగ్ ఎందుకు చేయలేదనే విషయాన్ని తెలిపింది. ‘ఒకసారి ఇద్దరమే షూటింగ్‌లో ఉన్నపుడు.. ఎక్స్‌పోజింగ్ గురించి అడిగాను. వెంటనే.. ఎందుకే ఎక్స్‌పోజ్ చేయాలి? రేపు పెళ్లై భర్త పక్కనే ఉన్నపుడు మన సినిమాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? మన ఫ్యామిలీకి ఎలా అనిపిస్తుంది? డబ్బుల కోసం ఇలా చేస్తే రేపు ఎలా? అని తిరిగి తననే ప్రశ్నించేదని ఆమని చెప్పుకొచ్చింది. ఒక నియమం పెట్టుకొని ఎక్స్‌పోజింగ్‌కు సౌందర్య దూరంగా ఉందని, అందులో తప్పులేదని ఆమెని తెలిపింది.

చదవండి: 
వరుణ్‌ పెళ్లిపై నాగబాబు కామెంట్‌.. ఆ అమ్మాయి అయినా ఓకేన

జెనీలియా చేతికి గాయం: భర్త సపర్యలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top