పుష్ప 2 మూవీలో ఛాన్స్‌ వదిలేసుకున్నా: రవి కృష్ణ | Sakshi
Sakshi News home page

లవ్‌ మీ థియేట్రికల్‌ ట్రైలర్‌ లాంచ్‌.. పుష్ప 2 వదిలేశానన్న నటుడు

Published Thu, May 23 2024 7:09 PM

Actor Ravi Krishna Says He Missed Chance In Pushpa 2 Movie

మనుషుల మధ్య ప్రేమ ఎప్పుడూ ఉండేదే! అదే దెయ్యాన్ని ప్రేమిస్తే.. దెయ్యాన్ని చూస్తే భయపడతారు కానీ ఎవరైనా ప్రేమిస్తారా? అంటారేమో! ఈ సినిమాలో అంతే.. హీరో ఆశిష్‌ ఘోస్ట్‌తో లవ్‌లో పడతాడు. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ లవ్‌ మీ. ఇఫ్‌ యూ డేర్‌ అనేది క్యాప్షన్‌. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో నటుడు రవికృష్ణ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.

'లవ్‌ మీ సినిమాలో యాక్ట్‌ చేస్తున్నప్పుడు నాకు పుష్ప 2లో నటించే ఛాన్స్‌ వచ్చింది. కానీ డేట్స్‌ క్లాష్‌ అవడం వల్ల ఆ సినిమా చేయలేకపోయాను. అంత పెద్ద సినిమా మిస్‌ చేసుకున్నప్పటికీ ఈ మూవీ నాకొక మైల్‌ స్టోన్‌గా ఉండిపోతుందన్న నమ్మకముంది. నన్ను నమ్మి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్‌' అని పేర్కొన్నాడు. లవ్‌ మీ సినిమా మే 25న విడుదల కానుంది.

 

చదవండి: పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement