షూటింగ్‌లో గాయపడ్డ హీరో నితిన్‌? | Sakshi
Sakshi News home page

షూటింగ్‌లో గాయపడ్డ హీరో నితిన్‌?

Published Thu, Jan 11 2024 9:06 AM

Actor Nithin Injured In Shooting Spot - Sakshi

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌కు గాయాలు అయినట్లు నెట్టింట ఒక వార్త వైరల్‌ అవుతుంది. వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో 'తమ్ముడు' అనే సినిమా షూటింగ్‌లో పాల్గొన్న నితిన్‌కు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో ప్రస్తుతం షూటింగ్‌ జరుగుతుంది. అక్కడ భారీ యాక్షన్ సీన్‌లో పాల్గొన్న నితిన్‌కు ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ప్రమాదం జరిగిన వెంటనే షూటింగ్‌ను క్యాన్సిల్‌ చేశారట. నితిన్‌కు సుమారు మూడు వారాలపాటు రెస్ట్‌ తీసుకోవాలని వైద్యులు చెప్పారట.

గతేడాదిలో  నితిన్,  శ్రీలీల జోడీగా నటించిన చిత్రం  'ఎక్స్‌ట్రా - ఆర్డిన‌రి మ్యాన్'తో ఆయన అంతగా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాడు. దీంతో దిల్ రాజు బ్యానర్‌లో వస్తున్న ఈ చిత్రంతో హిట్‌ కొట్టాలని నితిన్ ఉన్నాడు. గతంలో ఇదే బ్యానర్‌లో 'శ్రీనివాస కళ్యాణం' చిత్రంలో ఆయన నటించిన విషయం తెలిసిందే. అక్కా, తమ్ముడు అనుబంధం నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు టాక్ నడుస్తోంది. అందుకే  ఈ చిత్రానికి తమ్ముడు అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు సమాచారం.

చాలారోజుల నుంచి ఒక సూపర్‌ హిట్‌ సినిమా తీసి తన ఫ్యాన్స్‌కు ఆయన గిఫ్ట్‌గా ఇవ్వాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో తమ్ముడు చిత్రం కోసం ఆయన ఎక్కువగా కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో షూటింగ్‌ స్పాట్‌లో ఆయనకు ప్రమాదం జరిగింది అనే వార్త బయటకు రావడంతో నితిన్‌ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఈ ప్రమాదం గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన  ఇంకా రాలేదు.

Advertisement
 
Advertisement