
మలయాళ హీరో మోహన్ లాల్‌ని అత్యున్నత పురస్కారం వరిచింది. ఈయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ దక్కినట్లు కేంద్రం ప్రకటించింది. సెప్టెంబరు 23న ఢిల్లీలో జరిగే జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని మోహన్ లాల్‌కి ప్రదానం చేయబోతున్నారు. ఆయన అసమాన ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, అవిశ్రాంత కృషి.. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక బంగారు ప్రమాణాన్ని నెలకొల్పాయని కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2023 సంవత్సరానికిగానూ మోహన్ లాల్‌కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వరించింది.