తనువు చాలించిన బాలీవుడ్‌ నటుడు | Actor Faraz Khan Passes Away | Sakshi
Sakshi News home page

తనువు చాలించిన బాలీవుడ్‌ నటుడు

Nov 4 2020 11:06 AM | Updated on Nov 4 2020 11:16 AM

Actor Faraz Khan Passes Away - Sakshi

సాక్షి, ముంబై:  బాలీవుడ్ ప్రముఖ నటుడు ఫరాజ్ ఖాన్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి బుధవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్నినటి పూజా భట్ ట్విటర్‌లో షేర్‌ చేశారు. భారమైన హృదయంలో ఈ విషాదాన్ని మీతో పంచుకుంటున్నానని ట్వీట్‌ చేశారు ఇకపై కూడా ఫరాజ్‌ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. అలాగే అవసరమైన సమయంలో సాయం అందించిన అందరికీ  ఈ సందర్భంగా  ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

గత నెలలో ఛాతీ, మెదడు సంబంధింత ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. హాస్పిటల్‌ ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో అతనికి సాయం చేయాల్సిందిగా పూజా భట్ ట్వీట్  చేశారు. దీంతో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ స్పందించి సాయం అందించారు. కాగా ఫరాజ్ ఖాన్ 1990లో బాలీవుడ్‌లో నటుడిగా ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఫరేబ్, మెహందీ, మైనే ప్యార్ కియా వంటి చిత్రాల్లో  తన నటనతో ఆకట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement