ఇప్పుడే హ్యాపీగా ఎంజాయ్‌ చేస్తున్నామంటోన్న నటుడు

Actor Aadar Jain Reveals About His Marriage With Tara Sutaria - Sakshi

బాలీవుడ్‌ జంట తారా సుతారియా, ఆదార్‌ జైన్‌ ఏ ఫంక్షన్‌కైనా, ఏ ఈవెంట్‌కైనా కలిసే వెళ్తారు. ఎవరింట్లో సెలబ్రేషన్స్‌ జరిగినా ఇద్దరూ హాజరవ్వాల్సిందే. ప్రేమలో మునిగి తేలుతున్న వీళ్లిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారని ఫిల్మీదునియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ ఊహాగానాలపై నటుడు తారక్‌ సుతారియా స్పందించాడు.

ప్రస్తుతం తారా, తాను సంతోష క్షణాలను ఆస్వాదిస్తున్నామని, త్వరలోనే కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయని హింటిచ్చాడు. కానీ వాటి గురించి మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదన్నాడు. అనుకూలమైన సమయం, సందర్భం వచ్చినప్పుడు తానే అన్ని వివరాలు చెప్తానని పేర్కొన్నాడు. కాగా తారా సుతారియా, ఆదార్‌ జైన్‌ ప్రేమలో ఉన్నట్లు ఎప్పటినుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆదార్‌ సోదరుడు అర్మాన్‌ పెళ్లికి తారా వెళ్లడం, అక్కడ ఆదార్‌తో కలిసి సంగీత్‌లో డ్యాన్స్‌ చేయడంతో వీరి మధ్య బలమైన బంధం ఉందని ఫిక్సయ్యారంతా. ఇక తారా బర్త్‌డేను పురస్కరించుకుని వీళ్లు మాల్దీవులకు కూడా వెళ్లొచ్చడంతో ప్రేమ పక్షులని నిర్ధారణకు వచ్చేశారంతా!

చదవండి: విసిగిపోయాను, కానీ బతికే ఉన్నా: శక్తిమాన్‌ నటుడు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top