బర్త్‌డేకి లుక్‌? | Acharya Movie First Look May Release On Megastar Chiranjeevi Birthday | Sakshi
Sakshi News home page

బర్త్‌డేకి లుక్‌?

Aug 5 2020 3:05 AM | Updated on Aug 5 2020 5:27 AM

Acharya Movie First Look May Release On Megastar Chiranjeevi Birthday - Sakshi

అభిమాన కథానాయకుడి పుట్టినరోజు వస్తోందంటే అభిమానులకు పండగే. తాము నటిస్తున్న తాజా చిత్రాల టైటిల్, ఫస్ట్‌ లుక్, టీజర్, ట్రైలర్‌... ఇలా ఏదో ఒకటి బర్త్‌డే కానుకగా విడుదల చేసి అభిమానులను ఫుల్‌ ఖుషీ చేస్తుంటారు హీరోలు. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ నుంచి బర్త్‌డే కానుకగా ఏదో ఒక సర్‌ప్రైజ్‌ ఉంటుందనే ఊహాగానాలు నెలకొన్నాయి. కాగా ఫస్ట్‌ లుక్‌ని, కుదిరితే టీజర్‌ని కూడా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే దాదాపు 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందట. కరోనా లాక్‌డౌన్‌ వల్ల షూటింగ్‌ ఆగిపోయింది. పరిస్థితులు కొంచెం చక్కబడిన తర్వాత మళ్లీ షూటింగ్‌ మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement