ఉద్యమకారుడు?

Acharya first look and motion poster release - Sakshi

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. మెడలో ఎర్ర తుండు, చేతిలో కత్తితో సీరియస్‌ లుక్‌లో ఉన్నారు చిరు. మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మోషన్‌ పోస్టర్‌లో ఓ ఆకర్షణలా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో చిరంజీవి  ఉద్యమకారుడిగా నటిస్తున్నారని సమాచారం. రామ్‌చరణ్, నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుందని చిత్రబృందం తెలిపింది.

మిత్రుడికి చిరు కానుక
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చెక్కతో తయారు చేసిన హ్యార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు మోహన్‌బాబు. ‘నా చిరకాల మిత్రుడు తొలిసారిగా నా పుట్టినరోజునాడు ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి. థ్యాంక్యూ మోహన్‌బాబు’ అని ఆ బైక్‌తో దిగిన ఫోటోను ట్వీట్‌ చేశారు చిరు.


మోహన్‌బాబు కానుక ఇచ్చిన చెక్క బైక్‌తో చిరంజీవి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top