‘ఏం అర్హత ఉందని నీకు ఇంత అందమైన భార్య?’

Abhishek Bachchan Epic Reply To Troll About A Beautiful Wife He Does Not Deserve - Sakshi

యూజర్‌కి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన అభిషేక్‌ బచ్చన్‌

సెలబ్రిటీలకు సోషల్‌ మీడయా చాలా ముఖ్యం. అభిమానులకు అందుబాటులో ఉండాలంటే ప్రస్తుతం సోషల్‌ మీడియానే బెస్ట్‌ ఆప్షన్‌. అయితే దీని వల్ల మేలు ఎంత ఉంటుందో ఒక్కోసారి చెడు కూడా అంతే జరుగుతుంది. సోషల్‌ మీడియా వల్ల సెలబ్రిటీలు ఎదుర్కొనే ప్రధాన సమస్య ట్రోలింగ్‌, నెగిటివ్‌ కామెంట్స్‌. కొందరు దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తే.. మరి కొందరు మాత్రం గట్టిగానే కౌంటర్‌ ఇస్తారు. ఈ జాబితాలో ప్రథమ వరుసలో ఉంటారు అభిషేక్‌ బచ్చన్‌. 

సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యేవారిలో జూనియర్‌ బచ్చన్‌ ఒకరు. అయితే తనను విమర్శించేవారిని ఊరికే వదిలి పెట్టరు అభిషేక్‌. తగిన సమాధానం చెప్పి నోరు మూయిస్తారు. తాజాగా ట్విట్టర్‌ వేదికగా మరోసారి ట్రోలింగ్‌కు గురయ్యారు అభిషేక్‌ బచ్చన్‌. కొద్ది రోజుల క్రితం అభిషేక్‌ తన కొత్త సినిమా బిగ్‌ బుల్‌ ట్రైలర్‌ని ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఈ సమయంలో ఓ యూజర్‌.. ‘‘మీరు అన్ని విషయాల్లో చాలా బాగుంటారు. కానీ ఒక్క విషయంలో మిమ్మల్ని చూస్తే ఈర్ష కలుగుతుంది. అదేంటి అంటే మీకు చాలా అందమైన భార్య లభించింది. అంతటి సౌందర్యరాశిని భార్యగా పొందే అర్హత మీకు లేదు’’ అంటూ కామెంట్‌ చేశాడు సదరు యూజర్‌.

ఇందుకు అభిషేక్‌ ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ‘‘మీ అభిప్రాయానికి థాంక్యూ బ్రదర్‌.. ఊరికే ఆసక్తి కొద్ది అడుగుతున్నాను.. నీవు ఇప్పుడు చాలా మంది పెళ్లి కాని వారిని ట్యాగ్‌ చేశావ్‌.. వీరిలో ఇలియాన, నిక్కి వీరంతా నాకు తెలుసు.. కానీ నువ్వెవరు.. అసలు నీ అర్హత ఏంటి’’ అంటూ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. దీనిపై మిగతా నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘అభిషేక్‌ ట్రోలర్స్‌ని మీరు హ్యాండిల్‌ చేసే తీరు సూపర్బ్‌’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం అభిషేక్‌ నటిస్తున్న బిగ్‌ బుల్‌ చిత్రం 1992లో జరిగిన స్టాక్‌ మార్కెట్‌ స్కామ్‌ ఆధారంగా తెరకెక్కించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 8న విడుదలవుతున్న ఈ చిత్రంలో అభిషేక్‌ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఇలియాన, నికితా దత్తా, మహేష్‌ మంజ్రేకర్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top