Abhiram Daggubati's Ahimsa Movie Release Date, New Poster, Trailer - Sakshi
Sakshi News home page

Ahimsa: యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానా సోదరుడి ‘అహింస’

Dec 6 2022 9:45 AM | Updated on Dec 6 2022 10:41 AM

Abhiram Ahimsa Movie Updates - Sakshi

నిర్మాత సురేశ్‌బాబు తనయుడు, హీరో రానా సోదరుడు అభిరామ్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘అహింస’. తేజ దర్శకత్వంలో పి. కిరణ్‌ నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ, కొత్త పోస్టర్లను విడుదల చేసింది చిత్రయూనిట్‌.

‘‘యూత్‌ఫుల్‌ లవ్, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘అహింస’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఆర్పీ పట్నాయక్‌ సంగీతం అందించిన ‘నీతోనే నీతోనే..’, ‘కమ్మగుంటదే..’  పాటలు చార్ట్‌ బస్టర్స్‌గా నిలిచాయి. త్వరలోనే సినిమాని థియేటర్లలో విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌ రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement