Anu Aggarwal: కారు ప్రమాదంతో కోమాలోకి నటి, బతకడం కష్టమేనని చేతులెత్తేసిన డాక్టర్స్‌

Aashiqui Heroine Anu Aggarwal Lost Her Memory After Slipping Into Coma - Sakshi

ఆషికి సినిమా హీరోయిన్‌ అను అగర్వాల్‌ గుర్తుందా? 1990లో డైరెక్టర్‌ మహేశ్‌ భట్‌.. రాహుల్‌, అను అగర్వాల్‌లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఆషికి సినిమా తీశాడు. ఈ సినిమా హిట్‌ కావడంతో హీరో రాహుల్‌, హీరోయిన్‌ అను అగర్వాల్‌ ఓవర్‌నైట్‌ స్టార్లుగా మారిపోయారు. కానీ ఆ స్టార్‌డమ్‌ను వారు ఎంతోకాలం నిలబెట్టుకోలేకపోయారు. ఏవో కొన్ని సినిమాల్లో నటించి తర్వాత వెండితెరపై కనిపించకుండా పోయారు. నేడు (జనవరి 11) అను అగర్వాల్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

అను అగర్వాల్‌ మొదట్లో మోడల్‌గా పనిచేసేది. ఆషికి సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె తొలి చిత్రంతోనే ఘన విజయం సాధించింది. ఈ సక్సెస్‌తో ఆమెకు హాలీవుడ్‌ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయని అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే స్టార్‌ హీరోలతో నటించిన సినిమాలు కూడా పెద్దగా ఆడకపోవడంతో నెమ్మదిగా బాలీవుడ్‌ నుంచి సైడైపోయింది అను. 199లో ఆమె ఘోర కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. 29 రోజులు కోమాలోనే ఉండిపోయింది. ఆ తర్వాత కోలుకుంది కానీ గతాన్ని మర్చిపోయింది.

మాట్లాడే భాష ఏంటి? ఆ పదాల అర్థం ఏంటి? చుట్టూ ఉన్న ప్రపంచం ఏంటి? అనేది అర్థం కాక సతమతమైంది. ఒక రకంగా చెప్పాలంటే వేరే గ్రహంలో ఉన్నట్లు ఫీలయ్యానని తనే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. వైద్యులు కూడా ఆమె మూడేళ్ల కంటే ఎక్కువ బతకడం కష్టమని చేతులెత్తేశారు. కానీ అను ఆ మాటలను పట్టించుకోలేదు. తనతో తానే పోరాడింది. నెమ్మదిగా తను మర్చిపోయిన జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంది. యోగాను ఆశ్రయించింది. చివరికి ఈ పోరాటంలో గెలిచింది. తన పేరిట అను అగర్వాల్‌ అనే ఫౌండేషన్‌ స్థాపించి సేవలందిస్తోంది.

చదవండి: రిపోర్టర్‌ బర్త్‌డే.. ఊహించని గిఫ్ట్‌ ఇచ్చిన తారక్‌
నాటు నాటు.. ఎందుకంత క్రేజు

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top