Golden Globes 2023 Highlights: Jr NTR Surprises Reporter With Special Gift, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Jr NTR: మర్చిపోయా, నీ బర్త్‌డే కదా! ఒక చిన్న సర్‌ప్రైజ్‌.. వీడియో వైరల్‌

Published Wed, Jan 11 2023 4:39 PM | Last Updated on Wed, Jan 11 2023 7:19 PM

Golden Globes 2023: Jr NTR Surprises Reporter With Special Gift - Sakshi

ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌కు అవార్డుల మీద అవార్డులు వచ్చిపడుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్న ఈ సినిమా మరో ప్రతిష్టాత్మక అవార్డును కైవసం చేసుకుంది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు పాటకు గానూ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌ అందుకున్నారు. లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన ఈ అవార్డుల ఫంక్షన్‌కు చిత్రయూనిట్‌ తమ ఫ్యామిలీస్‌తో సహా విచ్చేశారు. ఈ సందర్భంగా యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ అక్కడి మీడియాతో మాట్లాడాడు.

అవకాశం వస్తే మార్వెల్‌ సినిమాలో నటించేందుకు రెడీ అని చెప్పుకొచ్చాడు. ఇక తనతో మాట్లాడుతున్న జర్నలిస్ట్‌ బర్త్‌డే అని తెలుసుకున్న తారక్‌ అతడికి ఓ గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడు. 'ఈరోజు నీ బర్త్‌డే కదా, అందుకే నా తరపు నుంచి ఈ చిన్న బహుమతి. ఇది కచ్చితంగా నీకు నచ్చుతుందనుకుంటున్నా' అంటూ అతడి చేతిలో ఓ గిఫ్ట్‌ బాక్స్‌ పెట్టి ఆప్యాయంగా హత్తుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: ప్రియుడినికి సీక్రెట్‌గా పెళ్లాడిన బిగ్‌బాస్‌ బ్యూటీ
ఆనంద్‌ హీరోయిన్‌ ఇలా మారిపోయిందేంటి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement