Aakasha Veedhullo:‘ ట్రైలర్‌ చాలా ఇంటెన్సింగ్‌గా అనిపించింది’ | Aakasha Veedhullo Movie Trailer Launched By Director Gopichand Malineni | Sakshi
Sakshi News home page

Aakasha Veedhullo: ట్రైలర్‌ చాలా ఇంటెన్సింగ్‌గా అనిపించింది : గోపీచంద్‌

Jul 23 2021 3:01 PM | Updated on Jul 23 2021 3:36 PM

Aakasha Veedhullo Movie Trailer Launched By Director Gopichand Malineni - Sakshi

గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. మనోజ్ డి జె, డా. మణికంఠ నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా గోపీచంద్‌ మాట్లాడుతూ.. కొత్త దర్శకుడైనా గౌతమ్‌ కృష్ణ ఈ మూవీని అద్భుతంగా తీశాడని కొనియాడాడు. దర్శకత్వమే కాదు, హీరోగా కూడా చాలా ఇంటెన్స్‌తో నటించారని మెచ్చుకున్నారు. ట్రైలర్ చూసాకా చాలా ఇంటెన్సింగ్ గా అనిపించిందన్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. 

నిర్మాత మనోజ్ మాట్లాడుతూ .. ‘ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన ఓ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా నాలుగు సాంగ్స్ ఉన్నాయి .. అందులో రాహుల్ సిప్లిగంజ్ పాడిన సాంగ్ థియటర్స్ లో దద్దరిల్లి పోతుంది. అలాగే రాహుల్ రామకృష్ణ, చిన్మయి లాంటి వాళ్ళు పాడిన పాటలు కూడా అదిరిపోతాయి. తప్పకుండా మా సినిమా అందరికి నచ్చుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. 

హీరో , దర్శకుడు గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. సాధారణంగా హీరో, దర్శకుడు ఒక్కరే అయితే ఆ ఎదో డబ్బులున్నాయి కాబట్టి చేసుకుంటున్నారు అని అందరు అంటారు. కానీ అది కాదు .. ఈ సినిమాకు నేనే దర్శకుడు అవ్వడానికి కారణం .. ఒక కథను తెరపైకి ఎక్కించే క్రమంలో దర్శకుడు అన్ని విధాలుగా రెస్పాన్స్ తీసుకోవాలి, పైగా చెప్పే కథలో ఎక్కడ ఇంటెన్షన్ తగ్గకూడదని నేనే దర్శకత్వం వహిస్తున్నాను. ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాం. దాదాపు 160 పేజీల స్క్రిప్ట్ నేనొక్కణ్ణే రాసుకున్నాను. తప్పకుండా మీ అందరికి ఈ సినిమా నచ్చుతుంది’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement