వరల్డ్ కప్ ఎఫెక్ట్‌.. వాయిదా పడ్డ మెగా హీరో సినిమా! | Sakshi
Sakshi News home page

వరల్డ్ కప్ ఎఫెక్ట్‌.. వాయిదా పడ్డ మెగా హీరో సినిమా!

Published Wed, Nov 1 2023 2:22 PM

AadiKeshava Movie Release Date Postponed - Sakshi

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, హాట్‌బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన తాజా  చిత్రం ‘ఆదికేశవ’. ఇంకో పది రోజుల్లో అంటే నవంబర్‌ 10న ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ అనూహ్యంగా వాయిదా పడింది. నవంబర్‌ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ మేరకు నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి ధృవీకరించారు. 

‘ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది. ఈ వరల్డ్ కప్ లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. భారత్ విజేతగా నిలుస్తుందనే అంచనాలున్నాయి. ఈ వరల్డ్ కప్ ప్రభావం సినిమాలపై పడుతుంది. ముఖ్యంగా భారత్ మ్యాచ్ లు ఉన్న సమయంలో థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపించడంలేదు. అందుకే నవంబర్ 10వ తేదీన విడుదల కావాల్సిన 'ఆదికేశవ'ను నవంబర్ 24వ తేదీకి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం’అని నిర్మాత నాగవంశీ తెలిపారు.

సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నామని, కఖచ్చితంగా అందరినీ అలరిస్తుందని అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి కూడా ఈ చిత్రంపై ఎంతో నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ ప్రేక్షకులతో పాటు యూత్‌, మాస్‌ ఆడియన్స్‌ని కూడా ఈ సినిమా అలరిస్తుందని అన్నారు.

‘ఉప్పెన' వంటి బ్లాక్‌బస్టర్‌తో అరంగేట్రం చేసిన పంజా వైష్ణవ్ తేజ్.. విభిన్న సినిమాలు, పాత్రలతో వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు 'ఆదికేశవ' అనే మాస్ యాక్షన్‌ సినిమాతో రాబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ నటుడు జోజు జార్జ్, అపర్ణా దాస్ ఈ సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement