ఆది సాయికుమార్‌ ‘తిస్‌మార్‌ ఖాన్‌’ షూటింగ్‌ పూర్తి | Aadi Saikumar And Payal Rajput Wrap Up Tees Maar Khan Movie Shooting | Sakshi
Sakshi News home page

ఆది సాయికుమార్‌ ‘తిస్‌మార్‌ ఖాన్‌’ షూటింగ్‌ పూర్తి

Dec 8 2021 9:15 PM | Updated on Dec 8 2021 9:15 PM

Aadi Saikumar And Payal Rajput Wrap Up Tees Maar Khan Movie Shooting - Sakshi

యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై పాయల్ రాజ్‌పుత్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ హై యాక్షన్ వోల్టేజ్  చిత్నాన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్లుక్ ఇప్పటికే విడుదల కాగా దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రంలోని యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయి.  బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. 

ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుప‌తి రెడ్డి మాట్లాడుతూ.. దర్శకుడు చెప్పిన కథ ఎంతో నచ్చి ఈ సినిమా చేశాను. కథ తగ్గ హీరో ఆది సాయి కుమార్ ఎంతో అద్భుతంగా నటించారు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. దర్శకుడు ఏదైతే కథ చెప్పాడో అదే తెరకెక్కించాడు. తప్పకుండా ఈ సినిమా అందరిని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు వెల్లడిస్తాం అన్నారు.

దర్శకుడు కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ..  తీస్ మార్ ఖాన్ చిత్రం విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆది సాయి కుమార్ను సరికొత్తగా ఆవిష్కరించే సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement