Tees Maar Khan: ఆది సాయి కుమార్‌ సినిమా నుంచి కొత్త అప్‌డేట్‌

Aadi Sai Kumar Tees Maar Khan Glance Released - Sakshi

విలక్షణ కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్‌ కొత్త సినిమా 'తీస్ మార్ ఖాన్'. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు 'నాటకం' ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. RX 100 సినిమాతో యువతను ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. 

ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు దర్శకనిర్మాతలు. ఇందులో భాగంగా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ క్రమంలో ప్రముఖ హీరో సందీప్ కిషన్ సోషల్ మీడియా వేదికగా 'తీస్ మార్ ఖాన్' గ్లాన్స్ రిలీజ్ చేశారు. 

ఈ వీడియోలో ఆది సాయికుమార్ పవర్ ప్యాక్డ్ లుక్‌లో కనిపించారు. సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. స్టూడెంట్‌గా, రౌడీగా, పోలీస్ ఆఫీసర్‌గా ఆది సాయికుమార్ త్రీ షేడ్స్‌లో అదరగొట్టనున్నారని తెలుస్తోంది. ఈ గ్లాన్స్ వీడియో ద్వారా సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయని స్పష్టమవుతోంది. ఈ సినిమాలో అది సాయికుమార్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. చిత్రం లోని యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయి. చిత్రానికి బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top