Aadavallu Meeku Johaarlu: 'ఆడవాళ్లు మీకు జోహార్లు' టైటిల్‌ సాంగ్‌ ఎప్పుడంటే..

Aadavallu Meeku Johaarlu Title Song To Be Released On Febrauary 4 - Sakshi

Aadavallu Meeku Johaarlu Title Song To Be Released: యంగ్‌ హీరో శర్వానంద్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'.  కిశోర్​ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్​ బ్యానర్​పై సుధాకర్​ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 25నప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో స్పీడు పెంచిన చిత్ర బృందం తాజాగా ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ని వచ్చేనెల4న, సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇక  ఖుష్బు, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top