ఏ1 ఎక్స్‌ప్రెస్‌ పరుగులు పెట్టేదప్పుడే! | A1 Express Fix Release Date | Sakshi
Sakshi News home page

ఆ డేట్‌ మార్క్‌ చేసి పెట్టుకోండి: సందీప్‌

Jan 12 2021 5:08 PM | Updated on Jan 12 2021 5:08 PM

A1 Express Fix Release Date - Sakshi

'ప్రస్థానం'తో వెండితెర మీద ప్రయాణాన్ని మొదలు పెట్టిన హీరో సందీప్‌ కిషన్‌. వైవిధ్యభరితమైన సినిమాలు చేసుకుంటూ పోతున్నా సరైన హిట్లు పడటం లేదు. దీంతో వరుస అపజయాలతో సతమతమవుతున్న ఆయన ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన 'ఏ1 ఎక్స్‌ప్రెస్'‌ సినిమాలో నటిస్తున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో హాకీ నేపథ్యంలో వస్తున్న తొలి చిత్రమిదేనని ఆయన గతంలోనే ప్రకటించాడు. ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేయగా మంచి స్పందన లభించింది. ఈ పోస్టర్‌లో ఎయిట్‌ ప్యాక్‌ బాడీతో ఒక చేతిలో హాకీ స్టిక్‌ పట్టుకుని, మరో చేతిలో చొక్కా ఊపుతూ కనిపించాడు హీరో. (చదవండి: 30 రోజుల్లో ఎలా ప్రేమించాలో ఆ రోజే తెలుస్తుంది!)

షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించాడు సందీప్‌. కుదిరితే ఫిబ్రవరి 12వ తేదీని మార్క్‌ చేసుకోండి అంటూ అభిమానులకు హింట్‌ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో లావణ్య త్రిపాఠీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్‌ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్, సందీప్‌ కిషన్, దయా వన్నెం నిర్మించారు. మరోవైపు రౌడీ బేబీ చిత్రంతోనూ బిజీగా ఉన్నారు. ఇందులో నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. (చదవండి: తల్లిలా పెంచుకున్న.. పెళ్లి చేశా: వితిక భావోద్వేగం)

Advertisement
 
Advertisement
Advertisement