జూన్‌ 8: సుశాంత్‌ ఇంట్లో 8 హార్డ్‌ డిస్క్‌లు ధ్వంసం

8 Hard Drives Destroyed On Day Rhea Chakraborty Left Sushant House - Sakshi

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసును  దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) సుశాంత్‌ స్నేహితుడు సిద్ధార్థ్‌ పితానీని వరుసగా ఆరో రోజు బుధవారం కూడా ప్రశ్నించింది. ఈ సందర్భంగా సిద్ధార్థ్‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ సమయంలో రియా చక్రవర్తి సుశాంత్‌తోనే కలిసి ఉందని తెలిపారు. ఈక్రమంలో జూన్‌ 8న సుశాంత్‌తో గొడవ పడ్డ రియా చక్రవర్తి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. అదే రోజు సుశాంత్ ఇంట్లో 8 హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం అయ్యాయని తెలిపారు. (బాలీవుడ్‌ పెద్దలు జైలుకెళ్లడం ఖాయం!)

సుశాంత్‌, రియా సమక్షంలోనే ఒక ఐటీ వ్యక్తి వచ్చి ఇదంతా  చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో సుశాంత్ మేనేజర్ దీపేష్, వంట మనిషి ధీరజ్ ఉన్నట్లు వెల్లడించారు.  కానీ ఆ హార్డ్‌ డిస్క్‌లో ఏముందో తనకు తెలియదని సిద్ధార్థ్‌ పిథాని తెలిపారు. అంతేగాక రియాకు డ్రగ్స్‌ లికులు ఉన్నాయన్న నేపథ్యంలో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) రంగంలోకి దిగింది. నిషేధిత మాదక ద్రవ్యాల వ్యవహారంలో పాత్ర ఉందనే ఆరోపణలపై రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసింది. తాజా పరిణామంతో సుశాంత్‌సింగ్‌ మృతి కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ సంస్థల జాబితాలో ఈడీ, సీబీఐ తర్వాత ఎన్‌సీబీ కూడా చేరినట్లయింది. మరోవైపు సుశాంత్ తరపు న్యాయవాది వికాస్ సింగ్.. సుశాంత్‌ మరణం వెనుక పెద్ద కుట్ర జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో కొంతమంది పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు కనిపిస్తోందని. ముంబయి పోలీసు కమిషనర్‌తోపాటు స్థానిక డీసీపీని ముందుగా సస్పెండ్ చేయాలని కోరారు. (డ్రగ్‌ డీలర్‌తో రియా చాట్‌.. అరెస్ట్‌!)

చదవండి : రియా చక్రవర్తిపై నార్కోటిక్‌ కేసు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top