రియా చక్రవర్తిపై నార్కోటిక్‌ కేసు

Narcotics Control Bureau registers case against Rhea Chakraborty - Sakshi

న్యూఢిల్లీ/ముంబై: నిషేధిత మాదక ద్రవ్యాల వ్యవహారంలో పాత్ర ఉందనే ఆరోపణలపై బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తిపై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) కేసు నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఇచ్చిన సమాచారం మేరకు ఎన్‌డీపీఎస్‌(నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రాపిక్‌ సబ్‌స్టాన్సెస్‌) చట్టంలోని పలు సెక్షన్ల కింద రియాతోపాటు ఇతరులపైనా కేసులు పెట్టినట్లు ఎన్‌సీబీ బుధవారం వెల్లడించింది.

నటుడు సుశాంత్‌సింగ్‌కు మాదక ద్రవ్యాలతో సంబంధమున్నదా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామని ఎన్‌సీబీ డీజీ రాకేశ్‌ ఆస్తానా తెలిపారు. సుశాంత్‌ మృతి కేసును మనీ ల్యాండరింగ్‌ కోణంలో దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈడీ.. రియా సెల్‌ఫోన్‌లోని వాట్సాప్‌ మెసేజీల్లో కొన్నిటిని తొలగించినట్లు గుర్తించింది. వీటిని తిరిగి సంగ్రహించి పరిశీలించగా అవి నిషేధిత గంజాయి తదితర మాదక ద్రవ్యాలతో సంబంధమున్నవిగా తేలింది. ఈ సమాచారాన్ని ఈడీ.. ఎన్‌సీబీకి అందించింది. తాజా పరిణామంతో సుశాంత్‌సింగ్‌ మృతి కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ సంస్థల జాబితాలో ఈడీ, సీబీఐ తర్వాత ఎన్‌సీబీ కూడా చేరినట్లయింది.

పితానీని ఆరో రోజూ ప్రశ్నించిన సీబీఐ
సుశాంత్‌ సింగ్‌ స్నేహితుడు సిద్ధార్ధ్‌ పితానీని సీబీఐ వరుసగా ఆరో రోజు బుధవారం కూడా ప్రశ్నించింది.  డీఆర్‌డీవో అతిథి గృహానికి బాంద్రా పోలీసు బృందం కూడా వచ్చి, గంట తర్వాత తిరిగి వెళ్లిందని అధికారులు తెలి పారు. సుశాంత్‌ మరణించిన జూన్‌ 14వ తేదీన అతని ఫ్లాట్‌లో సిద్ధార్థ్‌తోపాటు పనిమనిషులు ఇద్దరు కూడా ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top