
బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ కీలక పాత్రలో నటిస్తోన్న పీరియాడికల్ వార్ చిత్రం 120 బహదూర్. ఈ సినిమాను 1962 నాటి ఇండియా- చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. మేజర్ షైతాన్ సింగ్ భాటి జీవిత కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అప్పటి యుద్ధం సమయంలో జరిగిన వాస్తవ సంఘటనలతో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి రజనీశ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే రిలీజైన టీజర్ అభిమానులను ఆకట్టుకోగా.. తాజాగా మరో టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ఆమె నివాళిగా ప్రత్యేక టీజర్‌ను విడుదల చేశారు. 1962 భారత-చైనా యుద్ధంలో అమరవీరులను గౌరవించటానికి లతా మంగేష్కర్ 1963లో మొదటిసారి 'ఏ మేరే వతన్ కే లోగోన్' అనే సాంగ్‌ను ఆలపించారు. ఈ పాట చాలా కాలం పాటు అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది.
కాగా.. ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్ సోల్జర్‌గా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే యుద్ధ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌లోని విజువల్స్, డైలాగ్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమాను నవంబర్ 21 రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌లో రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్, అమిత్ చంద్రా నిర్మించారు.