సందిగ్ధం.. యాసంగి సాగు! | - | Sakshi
Sakshi News home page

సందిగ్ధం.. యాసంగి సాగు!

Nov 25 2026 10:59 AM | Updated on Nov 25 2026 10:59 AM

మెదక్‌ జిల్లాలో చెప్పుకోదగ్గ సాగునీటి ప్రాజెక్టులు లేవు. ఉన్న ఒక్కానొక్క మధ్యతరహా ఘనాపూర్‌ ప్రాజెక్టులో చుక్కనీరు లేదు. హల్దీ, మంజీరానదుల పరిస్థితి అంతే. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవక పోవటంతో చెరువులు, కుంటల్లో సైతం అంతంతమాత్రంగానే నీరుంది. అవి దాహం తీర్చేందుకు మాత్రమే ఉపయోగపడతాయని అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పేశారు. గతేడాదితో పోల్చితే భూగర్భజలాలు సైతం వేగంగా అడుగంటిపోతున్న తరుణంలో బోరుబావుల నుంచి వచ్చే నీటితో కేవలం ఆరుతడి పంటలను మాత్రమే సాగుచేయాలని అన్నిశాఖల అధికారులు అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు.

సబ్సిడీపై విత్తనాల సరఫరా!

గత ఏడాది యాసంగిలో 3.23 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా అందులో వరిసాగు 3 లక్షల ఎకరాల్లో సాగైంది. కాగా, ఈ ఏడాది నీటివనరుల్లో నీరులేక పోగా భూ గర్భజలాలు గత సంవత్సరంతో పోల్చుకుంటే గణనీయంగా తగ్గింది. అంతే కాకుండా విద్యుత్‌ సరఫరా సైతం తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది కేవలం 55 వేల ఎకరాల్లో మాత్రమే ఆరుతడి పంటలను సాగు చేయాలని చెబుతున్నారు. అందులోభాగంగా ఇప్పటికే పలురకాల ఆరుతడి విత్తనాలను సబ్సిడీపై అందించారు. అందులో శనగలు 84 క్వింటాళ్లు ఇవ్వగా 20 క్వింటాళ్లు పూర్తిగా ఉచితంగా అందించగా, మిగతా 64 క్విటాళ్లను 50% సబ్సిడీపై అందించారు. రెండు క్వింటాళ్ల కుసుమలను సైతం పూర్తి సబ్సిడీపై అందించగా 30 క్వింటాళ్ల జొన్నలు, 20క్వింటాళ్ల మొక్కజొన్నలను సైతం 50% సబ్సిడీపై రైతులకు అందించారు. కానీ, క్షేత్రస్థాయిలో రైతులు వరిసాగు కోసం నారుమళ్లు (తుకాలు) జోరుగా పోశారు. చివరికి రైతులు ఏ పంటలకు మొగ్గు చూపుతారు...? లాభం పొందుతారా..? లేక పెట్టుబడి పైన బడితే నష్టాలను మూటగట్టుకుంటారా అనేది కాలమే నిర్ణయిస్తోంది.

భరోసాపై లేని స్పష్టత!

ఈ యాసంగి పంట పెట్టుబడికి ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందా..? లేదా అనే విషయం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. గతేడాది యాసంగి పెట్టుబడిని మార్చిలో ఒక్కో ఎకరాకు రూ.6 వేల చొప్పున 3.5 లక్షల మంది జిల్లా రైతాంగానికి రూ.232 కోట్లను పెట్టుబడి సాయాన్ని అన్నదాతల ఖాతాల్లో జమచేసింది. గతేడాది మాదిరి ఈసారి కూడా ఆలస్యంగానైనా భరోసా నిధులు విడుదల చేస్తారా చేయరా అనే విషయం తెలియాల్సి ఉంది.

పీఎం కిసాన్‌ నిధి విడుదల

ఎప్పటిలాగానే కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా మూడు విడతల్లో ప్రతీ రైతు కుటుంబానికి రూ.6వేల చొప్పున పీఎం కిసాన్‌ నిధిని విడుదల చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ నెల మొదటి వారంలో ఇప్పటికే మొదటివిడత పీఎం కిసాన్‌ సమ్మాన్‌నిధిని 83 వేలమంది రైతులుకు గానూ రూ.22.60 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. మరో రెండు విడతల నిధిని సైతం ఎప్పటిలాగా విడుదల చేయనుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

ఆరుతడి పంటలే సాగుచేయాలంటూ అధికారుల ప్రచారం

ఇప్పటికే సబ్సిడీపై ఆరుతడి విత్తనాల పంపిణీ

రైతు భరోసాపై స్పష్టత కరువు

కేంద్రప్రభుత్వం పీఎం కిసాన్‌నిధి విడుదల

ఎల్‌నినో పుణ్యమా అంటూ ఈ యాసంగిలో పంటల సాగు సందిగ్ధంగా మారింది. ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలంటూ అధికారులు కాళ్లకు బలపం కట్టుకుని ఊరూర గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పలురకాల ఆరుతడి విత్తనాలను సైతం సబ్సిడీపై సరఫరా చేయగా, ఈ ఏడాది రైతుభరోసా ఇస్తారా..? లేదా అనే దానిపై నేటికీ స్పష్టత రాలేదు. కాగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం పీఎంకిసాన్‌ సమ్మాన్‌ నిధిని మొదటి విడత రైతుల ఖాతాల్లో జమ చేసింది. కానీ రైతులు మాత్రం క్షేత్రస్థాయిలో తుకాలు జోరుగా పోస్తుండటంతో ఈ సాగు సందిగ్ధంగా మారింది.

మెదక్‌జోన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement