● జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ● తూప్రాన్‌లో నూతన జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తులు
తూప్రాన్: న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల కన్నా న్యాయవాదుల పాత్రే ఎంతో గొప్పదని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును హైకో ర్టు న్యాయమూర్తులు జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ సుద్దాల చలపతిరావు ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పా టు చేసిన సభలో జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ ఒక ‘ల్యాండ్ ఆఫ్ సెలబ్రేషన్స్’అని, జీవితంలో ప్రతీరోజూ ఒక వేడుకలా భావిస్తూనే అందుకు తగ్గట్టుగా కష్టపడి పనిచేయాలని సూచించారు. యువ న్యాయవాదులు పబ్లిసిటీపై కాకుండా వృత్తిపై ఆదరణ పెంచుకోవాలని, లాయర్ యొక్క మంచితనమే వారికి అసలైన పబ్లిసిటీ అని హితవు పలికారు.


