హనుమాన్‌ ఆలయ నిర్మాణానికి భూమిపూజ | - | Sakshi
Sakshi News home page

హనుమాన్‌ ఆలయ నిర్మాణానికి భూమిపూజ

Nov 25 2026 10:59 AM | Updated on Nov 25 2026 10:59 AM

హనుమాన్‌ ఆలయ నిర్మాణానికి భూమిపూజ ప్రతీ ఏడాది రెన్యూవల్‌ చేయించుకోవాలి

పాల్గొన్న ఎంపీ రఘునందన్‌రావు

పటాన్‌చెరు: పట్టణంలోని గౌతమ్‌ నగర్‌ కాలనీలో నూతనంగా నిర్మించనున్న హనుమాన్‌ ఆలయానికి మంగళవారం భూమిపూజ నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన కాలనీ వాసులు, ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..దేవాలయాలు ఆధ్యాత్మిక చింతనకు, సామాజిక ఐక్యతకు కేంద్రాలుగా నిలుస్తాయన్నారు. భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సందేళ్ల ఆంజనేయులు, కుమార్‌, ట్రేడ్‌ సెల్‌ అధ్యక్షుడు కొండ లక్ష్మణ్‌, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్‌, రామచంద్రాపురం డివిజన్‌ అధ్యక్షుడు నర్సింగ్‌గౌడ్‌, కాలనీ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.

జిల్లా తూనికల, కొలతల అధికారి సుధాకర్‌

శివ్వంపేట(నర్సాపూర్‌): కాంటాలకు సంబంధించి వ్యాపారులు ప్రతీయేట రెన్యూవల్‌ చేయించుకోవాలని జిల్లా తూనికలు కొలతల అధికారి సుధాకర్‌ స్పష్టం చేశారు. మంగళవారం మండలంలోని రేషన్‌ దుకాణాలకు సంబంధించిన కాంటాలను పరిశీలించి స్టాంపింగ్‌ చేసి సీల్‌ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తూకానికి సంబంధించిన కాంటాల్లో ఎలాంటి వ్యత్యాసాలు ఉండకుండా చూడాలన్నారు. తూకంలో మోసాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల రేషన్‌ డీలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement