డీఎంహెచ్‌ఓ గణేశ్వర్
మెదక్ కలెక్టరేట్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్ల సేవలు కీలకమని డీఎంహెచ్‌ఓ గణేశ్వర్ అన్నారు. శనివారం తన ఛాంబర్‌లో నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగానే రోగులకు సత్వర చికిత్స అందించి త్వరితగతిన ఆరోగ్యవంతులను చేయవచ్చని తెలిపారు. ల్యాబ్ పరికరాలు సరిపడా ఉండాలన్నారు. చాలా మందికి కనీసం బ్లడ్ గ్రూప్ కూడా తెలియదన్నారు. విధుల పట్ల క్రమశిక్షణ, అప్రమత్తంగా ఉంటూ రోగ నిర్ధారణ త్వరితగతిన చేయాలని సూచించారు. కార్యక్రమంలో కీటక జనిత వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రోగ్రాం అధికారి డాక్టర్ నవ్యసువిధ వివరించారు. సమావేశంలో జిల్లా మాస్ మీడియా అధికారి అన్వర్, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.


