ఎమ్మెల్యే రోహిత్‌రావు
మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు శనివారం వినూత్నంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. నేలపై దీపం ఆకృతిలో కూర్చొని ఆకట్టుకున్నారు. – హవేళిఘణాపూర్(మెదక్)
మెదక్‌జోన్: పట్టణాభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఎమ్మెల్యే రోహిత్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థా పన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. గత బీఆర్‌ఎస్ పాలనలో పదేళ్లలో పట్టణాభివృద్ధికి చేసిందేమి లేదన్నారు. అంతకుముందు ఇటీవల కోతుల దాడిలో దెబ్బతిన్న చాకలి ఐలమ్మ విగ్రహ స్థలాన్ని పరిశీలించారు. త్వరలో నూతన విగ్రహాన్ని తన సొంత నిధులతో ఇప్పిస్తానని రజకులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ కానుగ రాధిక, దొంతి నరేశ్‌గౌడ్, నాయకులు గంగాధర్, కానుగ రాజు, రాగి అశోక్, రాము, సిద్దిరాములుతో పాటు రజకులు మల్లేశం, శివ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
‘దీపం’ ఆకృతిలో..


