కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని పశువులపై ఎల్‌నినో ప్రభావం పడకుండా అత్యంత ప్రాధాన్యతగా రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు శనివారం కలెక్టరేట్‌లో జిల్లాలో పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎల్‌నినో వల్ల వర్షాలు తగ్గి పశుగ్రాసం కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. పశువులకు తాగునీటి ఎద్దడి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరువు, అధిక ఉష్ణోగ్రతల నుంచి పశుసంపదను కాపాడేందుకు మండల స్థాయి సమన్వయ కమిటీల ద్వారా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పశుగ్రాసం కోసం ఉపాధి హామీ పథకం కింద ప్రైవేట్ భూముల్లో పశుగ్రాసం సాగును ప్రోత్సహించాలన్నారు. అలాగే జిల్లాలో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఈనెల 11 నుంచి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లలో ప్రజలు ఘనంగా దీపావళి పండుగ జరుపుకోవాలన్నారు. అనంతరం జిల్లాలో మూడో విడత టూరిజం అభివృద్ధి సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని వివిధ విభాగాల్లో అందజేసే రాష్ట్రస్థాయి అవార్డులకు ఈనెల 18లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అంతకు ముందు సర్ కార్యక్రమంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు.


