సైబర్‌ నేరాలపై అప్రమత్తం | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై అప్రమత్తం

Nov 8 2026 10:12 AM | Updated on Nov 8 2026 10:12 AM

ఏఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌

ఏఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌

హవేళిఘణాపూర్‌(మెదక్‌): నేరాల నియంత్రణకు ప్రజల కృషి ఎంతో అవసరమని, ఆ దిశగా సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌ సింగ్‌ అన్నారు. శనివారం మెదక్‌రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి అవుసులపల్లిలో పోలీసుల కమ్యూనిటీ ప్రోగ్రాంను నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షక్షణే ధ్యేయంగా పోలీసు సిబ్బంది పని చేస్తున్నారని కొనియాడారు. సైబర్‌ నేరగాళ్ల మాయమాటలు నమ్మి ఓటీపీ, వ్యక్తిగత వివరాలు చెబితే డబ్బులు లూటీ చేసే అవకాశం ఉందన్నారు. అలాగే వాహనం నడిపే సమయంలో తప్పకుండా హెల్మెట్‌ ధరిస్తే ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రాణాపాయం ఉండదన్నారు. అనంతరం మహి ళా చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్‌, సీఐలు మహేశ్‌, కృష్ణ మూర్తి, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది త దితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement