రాయికోడ్(అందోల్): మంజీర నది లో నీరు అడుగంటుతోంది. ఏటా ఇదే సమయంలో నీటితో కళకళలాడేది. ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతోంది. మండలంలోని పాంపాడ్, సిరూర్, మోరట్గా, మామిడిపల్లి, కర్చల్ తదితర గ్రామాల సమీపం నుంచి ప్రవహించే నదిలో బండరాళ్లు తేలడంతో పాంపాడ్ మిషన్ భగీరథ గ్రిడ్‌కు చెందిన ఇంటెక్వెల్లోకి సాధారణ నీటి ప్రవాహం నిలిచిపోయింది. దీంతో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడగా, అధికారులు నదిలోని నీరు ఇంటెక్వెల్లోకి మళ్లించడానికి పెద్ద కాలువ తీయించారు. కానీ ఫలితం లేకుండా పోకపోవడంతో మూడు పెద్ద మోటార్లను నది నీటిలో దింపి నీటిని పంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి మహబత్‌పూర్ సమీపంలోని పంప్‌హౌస్‌లో నీటిని శుద్ధి చేసి రెండు రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు.


