హామీలు అమలు చేయండి | - | Sakshi
Sakshi News home page

హామీలు అమలు చేయండి

Nov 8 2026 10:12 AM | Updated on Nov 8 2026 10:12 AM

మెదక్‌ కలెక్టరేట్‌: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్య లు పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం సమ్మెలో పాల్గొని వారికి మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం వైద్య ఆరోగ్య సేవలు అందించే ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సేవలు ఎంతో విలువైనవన్నారు. తమ ఉద్యోగ భద్రత, న్యాయమైన హక్కుల కోసం ఆందోళన చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్‌ రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పట్లోళ్ల మల్లిక, కౌన్సిలర్లు ఇప్ప అఖిల భరత్‌, పబ్బ రాజమణి లక్ష్మణ్‌, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు వడ్ల జనార్ధన్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement