పాపన్నపేట(మెదక్): డిజిటల్ సర్వేతో భూ వివాదాలకు చెక్ పడుతుందని మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ముద్దాపూర్‌లో జరుగుతున్న డిజిటల్ భూ సర్వేను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూ వివాదాలు, సరిహద్దు తగాదాలు, రికార్డుల్లో తప్పిదాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం డిజిటల్ సర్వే ప్రారంభించిందన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో జరిపే కొలతలు ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటాయన్నారు. భవిష్యత్తులో భూ సమస్యలు రాకుండా ఉంటాయన్నారు. భవిష్యత్తులో సమస్యలు రాకుండా జాగ్రత్తగా కొలతలు తీయాలని సిబ్బందికి సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ సతీశ్‌కుమార్, సిబ్బంది, రైతులు ఉన్నారు.
సర్వేతో భూ వివాదాలకు చెక్
Nov 7 2026 10:05 AM | Updated on Nov 7 2026 10:05 AM
సర్వేతో భూ వివాదాలకు చెక్ ‘పర్యావరణ పరిరక్షణకు
పాటుపడదాం’
పటాన్‌చెరు: వాతావరణ మార్పులను ఎదుర్కొంటూ పర్యావరణ పరిరక్షణకు సమష్టిగా కృషి చేయాలని విద్యావేత్తలు సూచించారు. పటాన్‌చెరులోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఐసీఎస్‌ఎస్‌ఆర్, రూసా నిధులతో నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ‘వాతావరణ అంశాలు, విధానం, శాస్త్రం, మానవాళి భవిష్యత్తు’ అనే అంశంపై మూడు సాంకేతిక సమావేశాలు నిర్వహించారు.
Advertisement


