మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్లోని జిల్లా మైనార్టీ శాఖలో కాంట్రాక్ట్ సిబ్బంది ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా అధికారి, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీసీ వెల్ఫేర్ అధికారి ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తుండగా, కార్పొరేషన్ శాఖకు చెందిన కంప్యూటర్ ఆపరేటర్ అన్నీ తానై విధులు నిర్వహిస్తున్నారు. గత రెండేళ్లుగా శాఖలో రెగ్యులర్ అధికారి లేకపోవడం గమనార్హం. మొదట నుంచి సీనియర్ అసిస్టెంట్ సూపర్వైజర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కనీసం అటెండర్ కూడా లేకపోగా, కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మహిళ ప్రసూతి సెలవులకు వెళ్లడంతో శాఖ మొత్తం ఖాళీ అయినట్లు అయింది. ఇక ఏళ్ల తరబడి కార్యాలయంలో సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, అటెండర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. జిల్లా అధికారులు లేకపోవడంతో మైనార్టీలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి మైనార్టీ సంక్షేమ శాఖలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నారు.
మిగతా అన్ని పోస్టులు ఖాళీ


