కొల్చారం(నర్సాపూర్): పశువులకు మెరుగైన వైద్యం అందించేందుకు సిబ్బంది ఎల్లప్పుడు అందుబాటులో ఉంటున్నారని జిల్లా పశు వైద్యాధికారి ఆదిత్యవర్మ తెలిపారు. బుధవారం మండలంలోని అంసాన్‌పల్లిలో పశువులకు నట్టల నివారణ మందు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. గొర్రెలు, మేకలు, దూడలు ఇతర పశువుల్లో ఉండే నట్టల నివారణకు మందు వేయించడం తప్పనిసరన్నారు. వైద్యుల సూచనల మేరకు నిర్ణీత కాలవ్యవధిలో నట్టల నివారణ మందు తాగించాలన్నా రు. అన్ని పశు వైద్యశాలల్లో మందు ఉచితంగా అందజేస్తామని వివరించారు. ఆయన వెంట మండల పశు వైద్యాధికారి వీరేశం, సిబ్బంది పాల్గొన్నారు.
సజావుగా రీ సర్వే
వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని శెట్టిపల్లి కలాన్‌లో బుధవారం ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఎండీ. హమీద్ పాషా, తహసీల్దార్, అటవీశాఖ అధికారులు పర్యటించారు. ఈసందర్భంగా క్షేత్రస్థాయిలో అటవీ భూముల సరిహద్దులను పరిశీలించి హద్దులను నిర్ధారించారు. రీ సర్వే ను పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రతి రోజూ రీ సర్వేను పరిశీలిస్తూ సజావుగా జరిగేలా పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నేడు విద్యుత్ సరఫరాలో
అంతరాయం
కొల్చారం(నర్సాపూర్): మండలంలోని అంసాన్‌పల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు ట్రాన్స్‌కో ఏఈ హైమద్ అలీ తెలిపారు. విద్యుత్ తీగల మరమ్మతులు, ఏబీ స్విచ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం సబ్‌స్టేషన్ పరిధిలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
దరఖాస్తుల ఆహ్వానం
మెదక్ కలెక్టరేట్: జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన పలు పోస్టులు భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మేనేజర్, కో ఆర్డినేటర్, సోషల్ వర్క్, సోషి యాలజీ, సైకాలజీ, సోషల్ వర్కర్, డాక్డర్, నర్స్, ఆయా, సెక్యూరిటీ వంటి పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. ఈనెల 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి సమాచారం, దరఖాస్తు ఫారం కోసం కలెక్టరేట్‌లో సంప్రదించాలని సూచించారు.
బడుగులు ఏకం కావాలి
హవేళిఘణాపూర్(మెదక్): ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు సమష్టిగా పోరాడి రాజకీయంగా ఉన్నత పదవులు సాధించేలా చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు అనిల్‌కుమార్ అన్నారు. బుధవారం మెదక్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అగ్రవర్ణాల వారు మాత్రమే ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని, 86 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వెనుకబడుతున్నారని వాపోయారు. సమష్టిగా కృషి చేస్తే అధికారం చేపట్టి బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందన్నారు. తరతరాలుగా వెనుకబడిపోతున్న బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా రాష్ట్ర అధ్యక్షురాలు కళావతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.


