డాక్టర్ పవిత్రవాణికి ఎమ్మెల్సీ ఇవ్వాలి
సంఘం జిల్లా అధ్యక్షుడు
జయరాములు డిమాండ్
చిన్నశంకరంపేట(మెదక్): తెలంగాణలోని పద్మశాలీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మంగళవారం ఓ ఫంక్షన్‌హల్‌లో జరిగిన పద్మశాలీ సంఘం సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా పద్మశాలీల సమస్యల పరిష్కారంతోపాటు రాజకీయంగా గుర్తింపు కోసం తెలంగాణ ఉద్యమదిక్సూచి కొండాలక్ష్మణ్ బాపూజీ కూతురు డాక్టర్ పవిత్రవాణికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి అందించాలని కోరారు. సిరిసిల్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్, కిష్టయ్య, చిన్నశంకరంపేట మండల పద్మశాలీ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


