అట్రాసిటీ కేసుల్లో అరెస్టులేవీ? | - | Sakshi
Sakshi News home page

అట్రాసిటీ కేసుల్లో అరెస్టులేవీ?

Nov 4 2026 7:58 AM | Updated on Nov 4 2026 7:58 AM

వివిధ ప్రజా సంఘాల నిలదీత

వివిధ ప్రజా సంఘాల నిలదీత

నర్సాపూర్‌: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన వ్యక్తులను వెంటనే ఎందుకు అరెస్టు చేయలేదని వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు జాతీయ మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు సంజీవ, కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, ఎంఆర్‌పీఎస్‌ నియోజకవర్గ కన్వీనర్‌ కుమార్‌, ఆయా ప్రజాసంఘాల నాయకులు శివ, యాదగిరి తదితరులు కలిసి మంగళవారం రెవెన్యూ కార్యాలయం సీనియ ర్‌ అసిస్టెంట్‌ అనితకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఇటీవల జరిగిన బతుకమ్మ, దసరా, బోనాల పండుగల నేపథ్యంలో జిల్లాలోని కోనాయిపల్లి, నవాబుపేట, కూచారం, వెంకటాయపల్లి, ఏదుల్లపల్లి, కిష్టాపూర్‌ తదితర గ్రామాల్లో ఎస్సీలపై దాడులు జరిగాయన్నారు. ఆయా గ్రామాలకు చెందిన బాధితుల ఫిర్యాదుల మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని లేనిపక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement