అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్
చిన్నశంకరంపేట(మెదక్): నేరాల నియంత్రణకు నిరంతర పెట్రోలింగ్ నిర్వహించడంతోపాటు అనుమానస్పద వ్యక్తుల కార్యకలాపాలపై దృష్టి సారించాలని జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్ స్పష్టం చేశారు. చిన్నశంకరంపేట పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ రికార్డులను, కేసుల పురగతిని పరిశీలించారు. పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.


