జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు జరగవు | - | Sakshi
Sakshi News home page

జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు జరగవు

Nov 4 2026 7:58 AM | Updated on Nov 4 2026 7:58 AM

అగ్నిమాపక జిల్లా అధికారి వేణు

అగ్నిమాపక జిల్లా అధికారి వేణు

హవేళిఘణాపూర్‌(మెదక్‌): దీపావళి పండుగను పురస్కరించుకుని విద్యార్థులు టపాసులు కాల్చేటప్పుడు ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక జిల్లా అధికారి వేణు సూచించారు. జిల్లా కేంద్రమైన మెదక్‌ ప్రభుత్వ గురుకుల బాలికల కళాశాల, చైతన్య పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ... టపాసులు కాల్చే ముందు చిన్న పిల్లలకు దూరంగా ఉండి కాల్చాలని సూచించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలను విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో మెదక్‌ ఫైరింగ్‌ స్టేషన్‌ అధికారి వెంకటేశ్‌, ఫైర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement